క్రైమ్/లీగల్

తరుణ్ తేజ్‌పాల్ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: తనపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టి వేయాలని తెహాల్క మ్యాగజైన్ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. తేజ్‌పాల్‌పై దాఖలైన లైంగిక వేధింపుల కేసును ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ గోవా కింది కోర్టును ఆదేశించింది. 2013 సంవత్సరంలో గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తేజ్‌పాల్ తనను లైంగికంగా వేధించాడని పాల్ మాజీ సహోద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2013 సంవత్సరం నవంబర్ 30న తేజ్‌పాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. తనను అనవసరంగా కేసులో ఇరికించారని, తాను ఆమెను లైంగికంగా వేధించలేదని తేజ్‌పాల్ తెలిపారు. అప్పుడు తేజ్‌పాల్ బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. అయితే 2014 సంవత్సరం మే నెలలో పాల్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఇలాఉండగా లైంగిక వేధింపుల కేసును కొట్టి వేయాల్సిందిగా తేజ్‌పాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా, గోవా పోలీసులు తేజ్‌పాల్ వాట్సాప్ మెస్సేజీలు, ఈ-మెయిల్స్ పంపిన ఆధారాలు ఉన్నందున విచారణను ఎదుర్కొవాల్సిందేనని కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు కేసును కొట్టి వేసేందుకు నిరాకరించింది. తనపై దురుద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చేశారని తేజ్‌పాల్ కోర్టుకు తెలిపారు. పైగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో, వీడియోలోనూ పొంతన లేదని పేర్కొన్నారు.