క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఆగస్టు 18: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు కథనం ప్రకారం.. మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన 11 మంది టాటా ఏస్ వాహనంలో ఆదివారం అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకుని తుని వద్ద తలుపులమ్మ లోవకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ధర్మవరం జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ఆగివున్న ఇనుప ఊచల లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయానికి వ్యాన్‌లో 11 మంది ఉండగా, వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనలో చెల్లుబోయిన మరిడియ్య (35), చెల్లుబోయిన వీరవెంకట సత్యనారాయణ (45), మట్టపర్తి ఏడుకొండలు (42) మృతిచెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై ఎస్ రవికుమార్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరిలో పరమేష్, హరికృష్ణల పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం... ప్రమాదానికి గురైన టాటా ఏస్ వాహనం