క్రైమ్/లీగల్

బ్రదర్ అనిల్ కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి భర్త అనిల్ కుమార్‌పై ఖమ్మం రెండో అదనపు జడ్జి ఎం జయమ్మ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 2009 మార్చి 28న ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఒక పార్టీకి ఓటేయాలని కరపత్రాలు పంచారంటూ ఆయనతో పాటు మరో ముగ్గురిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో మొదటి నిందితునిగా ఉన్న అనిల్ కుమార్ కోర్టుకు హాజరుకావడం లేదు. మిగిలిన ముగ్గురు కోర్టుకు హాజరవుతున్నప్పటికీ అనిల్ ఒక్కసారి కూడా హాజరు కాలేదు. దీంతో వచ్చే సోమవారం అనిల్ కుమార్ తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలంటూ జడ్జి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. ఆయన ఈ నెల 19న కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

అనిల్‌కుమార్ (ఫైల్‌ఫొటో)