క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు మునే్నటిలో పడి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, ఆగస్టు 18: శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన బాలుడు మునే్నటిలో దిగి స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన మాణిక్యాల విజయ్ (14) తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఆదివారం ఉదయం పెనుగంచిప్రోలు గ్రామానికి వచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు ముందు విజయ్ తన స్నేహితులతో కలిసి మునే్నటిలోకి దిగి స్నానం చేస్తుండగా అనుకోకుండా ఫిట్స్ రావడంతో బాలుడు నీళ్లలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు బంధువులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన విజయ్‌ని గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యాధికారి నిర్ధారించారు. ఎస్‌ఐ మహమ్మద్ షఫీక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.