క్రైమ్/లీగల్

ఖైరతాబాద్ రహదారిపై హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 18: ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై ఓ కూలి హత్యకు గురైన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం భూక్యా తాండాకు చెందిన బంగారి (56) నగరానికి వలస వచ్చి స్థిరపడ్డాడు. ఖైరతాబాద్‌లోని మహాభారత్ నగర్‌లో భార్య శాంతి, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ అడ్డా కూలిగా జీవనం సాగిస్తున్నాడు. భార్యతో శనివారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో భార్య శాంతి పిల్లలను తీసుకొని సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం బంగారి కూడా బయటకు వచ్చాడు. ఆదివారం ఉదయం ఖైరతాబాద్ రహదారిపై ఉన్న మెట్రో పిల్లర్లు ఏ 1175, 1176ల మధ్య నిర్జీవంగా పడి ఉన్నాడు. ఉదయం రహదారిని శుభ్రం చేసేందుకు వచ్చిన జీహెచ్‌ఎంసీ కార్మికులు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బంగారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సైఫాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.