క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఆగస్టు 18: ద్విచక్ర వాహనం అదుపుతప్పిన సంఘటనలో యువకుడు మృతి చెందిన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కీసర మండలం, భోగారం గ్రామానికి చెందిన చుంచు పర్వతాలు, హేమలతల కుమారుడు చుంచు రాహుల్ (21) ఆదివారం ఉదయం కుషాయిగూడ నుంచి కీసర వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. కుందన్‌పల్లి చౌరస్తా వద్ధకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పటంతో, రాహుల్ ఎగిరి పడి డివైడర్ మీద పడి పోయాడు. తీవ్ర గాయాల పాలైన రాహుల్ అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సీఐ నరేందర్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.