క్రైమ్/లీగల్

యువకుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఆగస్టు 18: జిల్లెలగూడ వెంకటేశ్వర నగర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ గాంధీనారాయణ, సీఐ ఎన్.యాదయ్య కథనం ప్రకారం పాత బస్తీకి చెందిన మురళి లలిత దంపతులు తమ కుటుంబంతో కలిసి గత రెండు సంవత్సరాలుగా జిల్లెలగూడ వెంకటేశ్వర నగర్‌లో నివాసం ఉంటున్నారు. మురళి, లలిత కుమారుడు సందీప్ (30) మెడికల్ రిపజేంట్యీవ్‌గా పని చేస్తున్నాడు. శనివారం అర్థ రాత్రి ఓ వ్యక్తి 100కు ఫోన్ చేసి, ఇక్కడ ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు తమకు సమాచారం అదించారని పోలీసులు తెలిపారు. కేసుర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు సందీప్ మృత దేహన్ని అప్పగించారు.