క్రైమ్/లీగల్

హాస్టల్‌లో విద్యుదాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్లారి : కర్నాటకలోని జిల్లా కేంద్రమైన కొప్పళలో ఓ ప్రైవేట్ భవన సముదాయంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో ఆదివారం విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఎగురవేసేందుకు హాస్టల్ భవనం పైభాగంలో డబ్బాలో ఇసుక పోసి ఇనుప స్తంభం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున స్తంభానికి కట్టిన తాడును తీసే ప్రయత్నం చేస్తుండగా ఇనుప స్తంభం పక్కనే ఉన్న విద్యుత్ తీగలను తాకింది. దీంతో 10వ తరగతి విద్యార్థులు మల్లికార్జున(15), బసవరాజు(15), 9వ తరగతి విద్యార్థులు దేవరాజు(14), కుమార్(14), 8వ తరగతి విద్యార్థి గణేష్(13) షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.