క్రైమ్/లీగల్

ధనియాలపేటలో యువకుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఆగస్టు 17: స్థానిక ధనియాలపేటకు చెందిన దులా భార్గవ్ (24) దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతుడు భార్గవ్ 2018 ఏప్రిల్‌లో బేతవోలు శ్మశానవాటికలో హత్యకు గురైన ఇలపర్తి నాగచౌదరి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సేకరించిన వివరాల ప్రకారం భార్గవ్ శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటికి సమీపంలో మద్యం తాగుతూ కూర్చున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి ఇంటికి వెళ్తున్నారు. వీరికి, భార్గవ్‌కు మధ్య వారం రోజులు కిందట గొడవ జరిగింది. మళ్ళీ అదే గొడవ ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో భార్గవ్‌ను కత్తి, స్క్రూడ్రైవర్లతో కిరాతకంగా పొడిచి హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న గుడివాడ డీఎస్పీ సత్యానందం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మచిలీపట్నం నుండి క్లూస్‌టీంను రప్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్గం నిమిత్తం గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.