క్రైమ్/లీగల్

మధ్యప్రదేశ్ గ్యాంగ్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ గ్యాంగ్‌ను నగర పోలీసులు అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ముఠాకు సంబంధించిన వివరాలను కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. తార్నాకలో నివాసం ఉండే సతీష్ ఇంట్లో గత నెల 26న జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
తార్నాకలో జరిగిన దొంగతనంలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, వారిలో మనీషా డిస్కో, అలీ రాజా ఖాన్‌తో పాటు రూపా బాయ్‌లను అరెస్టు చేసిన్నట్లు సీపీ తెలిపారు.
ఈ గ్యాంగ్ ముఠా సభ్యులు తెలుగు రాష్ట్రాల్లో 2004 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. పట్టుబడిన మధ్యప్రదేశ్ గ్యాంగ్ నుంచి రూ.22లక్షలు విలువ చేసే 60 తులాల బంగారం, 2కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, రేణిగుంట పోలీస్టేషన్ పరిధిలో ఈ గ్యాంగ్‌పై దాదాపు 12 కేసులు నమోదాయ్యాయి.