క్రైమ్/లీగల్

ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 17: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు చేపట్టారు. శనివారం కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న పూరాతన దేవాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు దేవాలయంలోకి చొరబడి తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్థులు వివరించారు. అతి ప్రాచీన దేవాలయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి పేరుంది.
పరమ పవిత్రంగా భావించే ఈ దేవాలయం భక్తుల పాలిట కల్పతరువుగా, కొలిచే భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఇలాంటి దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారన్న విషయం తెలుసుకున్న భక్తులు గ్రామం నుంచి తండోపతండాలుగా వచ్చి చూసి వెళ్తున్నారు. ఎంతో ప్రతిష్ట కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేయడం సరైన పద్ధతి కాదని, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని భక్తులు పోలీసులను కోరారు. ఈ విషయం తెలుసుకున్న కేశంపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాలను పరిశీలించడమే కాకుండా ఆలయ పూజారితోపాటు పలువురిని విచారించారు.