క్రైమ్/లీగల్

టెలికం నగర్‌లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఆగస్టు 17: సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. పోలీసులు నాలుగు లక్షల విలువ చేసే ఆభరణాలు పోయాయంటుంటే బాధితులు 60 తులాల బంగారం, ఐ ఫోన్ పోయినట్లు చెప్పడంపై అనుమానం వ్యక్తమవుతోంది. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని టెలికం నగర్‌లో ఈ భారీ చోరీ జరిగింది. 60 తులాల బంగారం, ఐ ఫోన్ పోయిందంటూంటే పోలీసులు మాత్రం 4లక్షల విలువ చేసే బంగారం పోయిందని చెప్తున్నారు. పోలీసులే కావాలని పోయిన సొత్తును తక్కువ చేసి చూపిస్తున్నారని బాధితులు అంటున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన ఆనంద్ పరమశివ, అతని భార్య హరిణి టెలికంనగర్ ప్లాటు నెంబర్ 39 గ్రౌండ్ ప్లోర్‌లో నివాసముంటున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భార్య, భర్త ఇద్దరు డ్యూటీకి వెళ్లారు. సాయంత్రం 8.45కు ఇంటికి వచ్చిన హరిణి తాళం తీసి లోపలికి వెళ్ల్లేందుకు ప్రయత్నించగా తలుపు లోపల గడిపెట్టి ఉండడంతో భర్తకు ఫోన్ చేసింది. తను ఇంటికి రాలేదని చెప్పడంతో వెనుకకు వెళ్లి చూడగా వెంటలేటర్ అద్దాలు పగలగొట్టి కిచెన్ డోర్ తెలిచి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు హరిణి వివరించింది. పోలీసులు వచ్చి పరిశీలించగా వెంటలేటర్ పగలగొట్టి లోపలికి వచ్చిన దుండగులు బీరువా తాళం పగులగొట్టినట్లు తెలిసింది. బంగారం, వెండి ఆభరణాలతో పాటు సామాగ్రి పోయినట్లు పోలీసులు చెప్తున్నారు. బీరువాలోని బట్టలు ఇతర సామాగ్రి చిందర పడవేసి వెళ్లిపోయారు. వెంటలేటర్ పగుల గొట్టి లోపలకి ప్రవేశించిన దొంగలు వెళ్లెటప్పుడు కిచెన్ డోర్ గుండా వెళ్లినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సంఘటన ప్రదేశాన్ని ఎస్‌ఓటీ, సీసీఎస్ బృందాలతో పాటు రాయదుర్గం పోలీసులు క్లూస్ టీమ్ పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ఇంటికి కమిషనరేట్‌కు ప్రహరి గోడ మాత్రమే అడ్డుండడం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగిన ఇంటికి ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగిన ఇంటికి కొంత దూరంలోని ఓ ఇంటి వద్ద ఉన్న సీపీ కెమెరా పూటేజ్‌లో ఇద్దరు యువకులు పరిసరాల్లో తచ్చాడినట్లు పోలీసులు గుర్తించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.