క్రైమ్/లీగల్

సంగీత దర్శకుడు ఖయ్యం ఆరోగ్యం విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 16: ప్రముఖ సంగీత దర్శకుడు, స్వరకర్త ఖయ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆరోగ్యం క్షీణించడంతో అతడిని ఇక్కడి సుజయ్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్పించారు. ‘కభీయే కభీయే’, ‘ఉమ్‌రావో జాన్’ వంటి చిత్రాల సంగీత స్వరకర్తగా ఎందరి ప్రశంసలనో అందుకున్న ఖయ్యం ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమి అవార్డుతో పాటు పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఖయ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్షుడు బీఎన్ తివారి తెలిపారు. ‘ఖయ్యం’గా ప్రాచుర్యం పొందిన మహమ్మద్ జాహుర్ ఖయ్యం హష్మి 17 ఏళ్ల వయసులో లూథియానా నగరంలో సంగీతంలో తన కెరీర్‌ను ప్రారంభించారు. బ్లాక్‌బస్టర్ ‘ఉమ్‌రావో జాన్’ చిత్రం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు. ఖయ్యం నేషనల్ అవార్డును, ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా పొందారు. ఖయ్యం సినిమాయేతర పాటలను కూడా ఆయన అభిమానులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ప్రత్యేకంగా ‘పావోన్ పదున్ తోర్ శ్యామ్’, ‘బ్రిజ్ మెయిన్ లౌత్ చలో’, ‘ఘాజబ్ కియా తేరే వాదే పే ఐత్‌బార్ కియా’ వంటి పాటలు అభిమానుల మన్ననలు అందుకున్నాయి. దివంగత మీనాకుమారి ఆల్బమ్‌కు కూడా ఖయ్యం సంగీతాన్ని సమకూర్చారు.