క్రైమ్/లీగల్

మరింత విషమించిన జైట్లీ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాష్టప్రతి కోవింద్ ఏయిమ్స్‌కు చేరుకుని ఐసీయులో చికిత్స పొందుతున్న జైట్లీని చూశారు. అనంతరం జైట్లీ ఆరోగ్యం గురించి ఆసుపత్రి డాక్టర్లు రాష్టప్రతికి వివరించారు. జైట్లీ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారం జరుగుత్ను సమయంలో రాష్టప్రతి ఆసుపత్రిని సందర్శించడంతో ఆ ప్రచారం మరింత బలపడింది. రాష్టప్రతి ఏయిమ్స్‌కు చేరుకోగానే కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌదరి ప్రభృతులు వెంట ఉన్నారు. 66 సంవత్సరాల వయస్సు గల జైట్లీ ఈ నెల 9న అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఏయిమ్స్‌లో చేర్పించారు.