క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో కానిస్టేబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 16: ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ఓ పోలీసు కానిస్టేబుల్ శుక్రవారం సాయంత్రం చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణకుమార్‌గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న తిరుపతిరెడ్డి అనే కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ట్రాక్టర్ యజమాని రమేష్‌ను ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలంటూ కానిస్టేబుల్ వేధిస్తూ ఒత్తిడి తెస్తుండటంతో ట్రాక్టర్ యజమాని రమేష్ ఏసీబీని ఆశ్రయించారు. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని పోలీసుస్టేషన్ ఆవరణలోనే పట్టుకున్నారు. కానిస్టేబుల్ రూ.17వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని డీఎస్పీ వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు.