క్రైమ్/లీగల్

చార్‌ధామ్ హైవే నిర్మాణంపై అత్యున్నత స్థాయి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఉత్తరాఖండ్ వ్యాప్తంగా నాలు గు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలుపుతూ 900 కిలోమీటర్ల మేర చేపట్టనున్న చార్‌ధామ్ హైవే నిర్మాణంపై సుప్రీంకోర్టు తాజాగా పలు సూచనలు చేసింది. గతంలో నేషన ల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) చేసిన మార్పులను సవరిస్తూ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఈ కమిటీ పర్యావరణానికి, సురక్షిత ప్రయాణానికి ఎటువంటి విఘాతం కలుగకుండా హైవే ప్రాజెక్టు ఉండేలా చూడాలని కోరింది. ఈమేరకు ఈనెల 22లోగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పా టు చేయాలని పర్యావరణ, అటవీ శాఖను ఆదేశించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 26న ఎన్‌జీటీ ఆమోదించిన హైవే ప్రాజెక్టులో మార్పులు అవసరమనీ.. చేపట్టబోయే ప్రాజెక్టు పర్యావరణ హితంగా ఉండాలని స్వచ్ఛంద సం స్థ అయిన సిటిజన్ ఫర్ గ్రీన్ డూన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈమేరకు న్యాయమూర్తులు రోహిన్‌టన్ ఫలి నారీమన్, సూర్యకాంత్‌ల ధర్మాసనం తాజాగా అత్యున్నత స్థాయి కమిటీని ఎన్‌జీటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
కమిటీలో ప్రభుత్వ అంతరిక్ష శాఖకు చెందిన వ్యక్తితో పాటు డెహ్రాడూన్‌కు వైల్డ్‌లైఫ్ సంస్థ, పర్యావరణ, అటవీ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వారు ఉండాలని సూచించింది. ఈ కమిటీ నాలుగు నెలల్లోగా హైవే నిర్మాణం నివేదిక అం దజేయాల్సి ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. కమిటీ మూడు నెలలకోసారి సమావేశమై ప్రాజెక్టు నిర్మాణంపై సలహాలు, సూచనలపై సమీక్షించాలని పేర్కొంది. జాతీ య రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖల ప్రాజెక్టుపై వివరాలు తరచూ తెలుసుకోవాలని కమిటీకి సూచించింది. చార్‌ధామ్ హైవే ప్రాజెక్టు నిర్మాణంపై జరిగే పర్యావరణ నష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించేలా చూడాలని కూడా పేర్కొంది. హిమాలయ పర్వతాలను కలుపుకొంటూ సాగే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా సురక్షితంగా ఉండేలా కమిటీ చూడాల్సి ఉంటుందని చెప్పింది.