క్రైమ్/లీగల్

లైంగిక వేధింపుల కేసులో ఆర్మీ మేజర్ జనరల్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 2016లో నాగాలాండ్‌లో ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఆర్‌ఎస్ జస్వాల్ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మిలటరీ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. ఈ కేసులో మేజర్ జనరల్ జస్వాల్‌ను దోషిగా పేర్కొంటూ జనరల్ కోర్టు మార్షల్ (జీసీఎం) నిర్దారించడాన్ని గత డిసెంబర్‌లోనే ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమోదించారు. భారత శిక్షా స్మృతి 354ఏ (లైంగిక వేధింపులు) కింద జస్వాల్‌ను దోషిగా జీసీఎం నిర్దారించింది. ఈమేరకు క్రమశిక్షణా చర్య కింద జస్వాల్‌ను విధుల నుంచి తప్పించడాన్ని ఆర్మీ చీఫ్ రావత్ నిర్దారించారు. ఇదిలా ఉంటే 2016 డిసెంబర్‌లో ఆర్మీ చీఫ్‌గా రావత్ నియామకాన్ని తాను వ్యతిరేకించడం వల్లే తనపై లైంగిక వేధింపుల కేసులు పెట్టారని జస్వాల్ ఆరోపించారు. లెఫ్టినెంట్ జనరల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల జీసీఎం బృందం జస్వాల్ కేసును విచారించింది. ఆర్మీ అడ్వకేట్ జనరల్ బ్రాంచ్‌కు చెందిన మహిళా అధికారిణి ఫిర్యాదుపైనే జస్వాల్‌ను విధుల నుంచి తప్పించారు.