క్రైమ్/లీగల్

అంధుడికి హైకోర్టు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: అంధుడికి ఉద్యోగం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, సరోజనీదేవీ కంటి వైద్యశాఖ సూపరింటెండెంట్‌లపై హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలైంది. విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం ఆఘమేఘాల మీద ఆయనకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. దృష్టిలోపం ఉన్న మురళీధర్ బ్లైండ్ రిజర్వేషన్ కోటాలో క్లాసు ఫోర్ బ్యాక్‌లాగ్ టైపిస్టు పోస్టుకు ఎంపికయ్యారు. అయినప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వడం లేదని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మురళీధర్‌కు ఉద్యోగం ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌నూ, సరోజనిదేవి కంటి వైద్యశాఖ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అయితే, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగం ఇవ్వడం లేదని మురళీధర్ హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను దాఖలు చేశాడు. కాగా, కోర్టు ధిక్కారణ పిటిషన్ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆఘమేఘాల మీద జిల్లా పంచాయతీకార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ పత్రాలు అందజేశారు. దాంతో న్యాయస్థానం కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను మూసివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది డిఎల్ పాండు వాదనలు వినిపించారు.