క్రైమ్/లీగల్

హీరా గ్రూప్‌కు ఈడీ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: స్కీముల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన రూ. 299.98 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలోని నౌహీరా షేక్ చెందిన హీరా గ్రూప్‌కు చెందిన రూ.277.29కోట్ల విలువైన స్థీరాస్తులున్నాయి. అలాగే బ్యాంకు ఖాతాల్లో రూ.2,269 కోట్లు ఉన్నాయి. రెంటినీ అటాచ్ చేసినట్టు శుక్రవారం ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. హీరా గ్రూప్ 96 చోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు ఈడీ గుర్తించింది. ఇళ్లు, ఫ్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, వ్యవసాయ భూములు ఈ జాబితాలో ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. చిన్న మొత్తాలకు భారీ మొత్తాలను తిరిగిస్తామని చెప్పి వేల కోట్ల రూపాయలు హీరా గ్రూప్ సేకరించింది. చివరికి ముదుపరులకు కుచ్చుకోటి పెట్టింది. దీనిపై విచారణను ప్రారంభించిన ఈడీ కుంభకోణం వెనక మానీలాండరింగ్ సైతం ఉన్నట్టు గుర్తించింది.