క్రైమ్/లీగల్

మీరేమంటారు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: తన దేశానికి తిరిగి పంపించేయాల్సిందిగా కోరుతున్న పాకిస్తాన్ వాసి అభ్యర్థనపై మీరేమంటారు? అని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వచ్చే నెల 23వ తేదీలోగా కోర్టుకు తెలియజేయాల్సిందిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విభూ బఖ్రు బుధవారం కేంద్రానికి, ఢిల్లీ రాష్ట్ర (ఆప్) ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పూర్వపరాల్లోకి వెళితే...పాకిస్తాన్‌కు చెందిన సజ్జాద్ హైదర్ తన దేశానికి పంపించేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సజ్జాద్ లోగడ ఓ క్రిమినల్ కేసులో పదేళ్ళ పాటు జైలు శిక్షను అనుభవించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ, లాంపూర్‌లో తాత్కాలిక క్యాంప్‌లో నివసిస్తున్న సజ్జాద్ తన శిక్షాకాలం పూర్తయ్యింది కాబట్టి తన మాతృ దేశానికి తిరిగి వెళ్ళేందుకు అనుమతించాల్సిందిగా కోరారు. కానీ తనను అందుకు అనుమతించడం లేదని సజ్జాద్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందుకు కోర్టు స్పందిస్తూ దీనిపై మీ సమాధానం ఏమిటంటూ కేంద్రానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.