క్రైమ్/లీగల్

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 14: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడడంతో ఆ వ్యక్తి మృతికి కారణమయ్యానని మనస్థాపంతో భవనం పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... గద్వాల్ జిల్లా రాజోలీ గ్రామానికి చెందిన ఎన్‌డి.మోహన్ కూకట్‌పల్లిలోని మాధవినగర్‌లో మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటూ స్థానికంగా హెచ్‌ఎఫ్‌సీ బావర్చి రెస్టారెంట్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం 3 గంటలకు మోహన్ తన స్నేహితులతో కలిసి పఠాన్‌చెరు దగ్గరలోని పద్మనాభం స్వామి ఆలయానికి (టీఎస్ 12యూబి 9823) నంబర్ కారులో బయలుదేరి వెళ్లారు. కూకట్‌పల్లికి వస్తుండగా నందిగామ దగ్గరలోని కర్దూనూర్ వద్ద వీరి కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. మోహన్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సంఘటన స్థలం నుంచి తప్పించుకుని ఇంటికి రాగా మరో స్నేహితుడు అక్కడ స్థానికుల చేతికి చిక్కాడు. ఇంటికి వచ్చిన మోహన్ ఓ వ్యక్తి మృతికి కారణమయ్యానంటూ తనకు ఏమవుతుందోనని భయంతో తాను ఉంటున్న భవనంలోని ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.