క్రైమ్/లీగల్

హిజ్రాల వేషంలో చోరీలు: ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 14: హిజ్రాల వేషంతో.. ఆటోలలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని సీసీఎస్ మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేసి బుధవారం కోర్టుకు రిమాండ్ చేశారు. పట్టుబడ్డవారిలో బోడుప్పల్ కళానగర్‌కు చెందిన తూర్పాటి యాదయ్య (32), సదుల ఆంజనేయులు అలియాస్ అంజయ్య (28), కల్లెం బాలయ్య అలియాస్ బాబు (28) ఉన్నారు. వీరు బిచ్చం అడుక్కుంటూ జీవనం గడుపుతున్నారు. హిజ్రాల వేషంతో ఈ నెల 10న చర్లపల్లి ప్రాంతంలోని బంగ్లాస్ కాలనీలో నివసిస్తున్న మీనాక్షి ఇంటికి వెళ్లారు. డబ్బులు అడిగితే ఆమె 200 ఇచ్చారు. ఇంకా కావాలని డిమాండ్ చేస్తూ ఇంట్లోకి వెళ్లి బలవంతంగా లక్ష్మీదేవి విగ్రహం వద్ద దాచిన రూ.50వేలు బలవంతంగా లాక్కొని పారిపోయారు. ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కుషాయిగూడ పోలీసులు దర్యాప్తులో భాగంగా కాలనీలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లో ఆటోను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నారు. వీరిలో ఆంజనేయులు, బాలయ్య ఇద్దరూ పాత నేరస్థులేనని విచారణలో వెల్లడైందని డీసీపీ కే.నారాయణ రెడ్డి తెలిపారు. నిందితులు గ్రామాల్లో బుర్రకథలు చెప్పుకుంటూ కాలం గడిపేవారు. ప్రస్తుతం ఆదరణ కరువవ్వడంతో పట్టణ ప్రాంతానికి వచ్చి ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎస్‌కే సలీమా, అధికారులు శివ కుమార్, జగన్నాధ రెడ్డి, మక్బూల్ జానీ, భాస్కర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.