క్రైమ్/లీగల్

అయోధ్య రామజన్మ స్థానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: అయోధ్య కచ్చితంగా రామజన్మ స్థానమేనని, పలువురు యాత్రీకులు చేసిన రచనలే ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని ‘రామ్ లాలా’ కమిటీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయోధ్య రామజన్మ భూమి కేసులో నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్ బోర్డుతోపాటు రామ్ లాలాకు కూడా 2.77 ఎకరాల రామజన్మ భూమిని సమభాగాల్లో పంచాల్సిందిగా 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రోజువారీ పద్ధతిలో విచారిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్
సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం రామ్ లాలా వాదనలు రికార్డు చేసింది. రామ్ లాలా తరఫున హాజరై తన వాదనలు వినిపించిన సీఎస్ వైద్యానాథన్ పలు అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. బ్రిటీష్ వ్యాపారి విలియమ్ ఫించ్ భారత్‌లో 1606-1611 మధ్యకాలంలో పర్యిటించారని, ఆయన రాసిన పుస్తకంలో అయోధ్య ప్రస్తావన ఉందని వైద్యనాథన్ అన్నారు. శ్రీరాముడు జన్మభూమి ప్రాంతంలోనే జన్మించినట్టు కోట్లాది మంది హిందువుల నమ్మకమని ఫించ్ తన రచనల్లో తెలిపిన విషయాన్ని వైద్యనాథన్ ప్రస్తావించారు. ఫించ్ ప్రాంతమే అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు అని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పురాణాలను కూడా ప్రస్తావించారు. వాటిలో కూడా అయోధ్యను శ్రీరాముడి జన్మస్థలంగా పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం కలుగజేసుకుని వివాదాస్పద ప్రాంతాన్ని బాబ్రీ మసీదుగా ఎప్పటినుంచి పరిగణిస్తున్నారని ప్రశ్నించింది. 19వ శతాబ్దంలో బాబ్రీ మసీదు ప్రస్తావన ఉన్నట్టు వైద్యనాథన్ సమాధానం ఇచ్చారు. మొఘల్ చక్రవర్తి బాబర్ రాసిన ‘బాబర్‌నామా’లో ఈ మసీదు ప్రస్తావన ఉందా అని ధర్మాసనం అడిగింది. అందుకు వైద్యనాథన్ సమాధానమిస్తూ ఈ విషయం బాబర్‌నామాలో ఎక్కడా ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఒక కట్టడం ఉన్నదని, అక్కడే శ్రీరాముడు జన్మించాడని హిందువులు నమ్ముతున్నారని ఫించ్ తన పుస్తకంలో రాసినట్టు వైద్యనాథన్ కోర్టుకు తెలిపారు. సదరు కట్టడాన్ని బాబర్ కూల్చివేసినట్టు ఏమైనా కచ్చితమైన ఆధారాలు ఉన్నాయా అని ఆయనను ధర్మాసనం ప్రశ్నించింది. సదరు కట్టడాన్ని కూల్చివేసి, మసీదు కట్టాల్సిందిగా ఔరంగజేబు ఆదేశించినట్టు వైద్యనాథన్ కోర్టుకు తెలిపారు. అయితే, అక్కడ బాబర్ మసీదును కట్టించినట్టు కొన్ని ఆధారాల వల్ల తెలుస్తోందని ఆయన వివరించారు. అక్కడ కచ్చితంగా రామాలయం ఉండేదని, దానిని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని వైద్యనాథన్ అన్నారు. ముస్లింల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ కల్పించుకుంటూ బాబర్‌నామాలోనూ ఈ మసీదుకు సంబంధించిన ప్రస్తావన ఉన్నట్టు తెలిపారు. కొన్ని పేజీలు కనిపించకుండా పోవడంతో స్పష్టత లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల సమయంలో రామజన్మభూమి ప్రాంతమే రాముడి జన్మస్థలంగా స్థానికులు పేర్కొన్నట్టు వైద్యనాథన్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనల తర్వాత కోర్టు శుక్రవారం నాటికి వాయిదా పడింది.