క్రైమ్/లీగల్

బాబుకు భద్రత తగ్గించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం కుదించిన భద్రతను పెంచాలని రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పిచ్చింది. తన భద్రత కుదించడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ అంశంపై హైకోర్టులో ఇటీవలే వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు తుది తీర్పును వెల్లడించారు. సెక్యూరిటీగా నియమించిన మొత్తం 97 మంది సిబ్బందిని యథాతథంగా కొనసాగించాలని, కాన్వాయ్‌లో జామర్లు విధిగా ఇవ్వాలని, క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే విషయంలో ఎన్‌ఎస్‌డబ్ల్యు, ఐఎస్‌డబ్ల్యు చర్చించుకోవాలని తేల్చి చెప్పింది. మూడు నెలల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుని 5 ప్లస్ 2 భద్రత ఇవ్వాలని సూచించింది. అయితే ఇద్దరు సీఎస్‌ఒలకు గాను ఒకరిని కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం హైకోర్టు సమర్థించింది.