క్రైమ్/లీగల్

చేపలు పట్టుకోవడానికి వెళ్లిన మెకానిక్ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 13: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన నల్గురిలో ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మలక్‌పేట్‌లో నివసిస్తున్న షేక్ వాహెద్ అలీ కుమారుడు షేక్ సాజిద్ అలీ (18) బైక్ మెకానిక్. అతడు ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం నారపల్లిలోని పెద్ద చెరువు వద్దకు వచ్చారు. చేపలు పట్టేందుకు వచ్చిన వీరు సరదాగా ఈతకు ఉపక్రమించారు. నల్గురిలో సాజిద్ అలీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. బయటకు రాకపోవడంతో కంగారు పడిన స్నేహితులు స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు అతని జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.