క్రైమ్/లీగల్

వెంటనే తేల్చండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: తమపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను వెంటనే విచారించాలని కాంగ్రెస్, జేడీ(ఎస్) రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ అంశాన్ని అత్యవసరంగా విచారణ జాబితాలో పెట్టాలంటూ కోర్టు రిజిస్ట్రార్‌కు ఓ మెమో అందించాలని సుప్రీంకోర్టు వారిని సూచించింది. శాసనసభ్యత్వాలపై అనర్హత వేటు పడిన కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్-జేడీ(ఎస్) తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రెబెల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రస్తోగి పిటీషన్ దాఖలు చేశారు. పిటీషనర్ల తరఫు వాదన వినిపించేందుకు ఈ నెల 19న అనుమతించాలని ఆయన కోరారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారని ఆయన చెప్పారు. గత నెల 29న అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి బలనిరూపణ కోసం నిర్వహించిన ఓటింగ్‌లో ఓడిపోవడం, ఆ వెంటనే బీజేపీ నాయకుడు బీఎస్ యెడుయూరప్ప సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. కాగా కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఎల్.జార్ఖిహోలి, మహేశ్ కుముతల్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్. శంకర్‌ల శాసనసభ్యత్వాలను స్పీకర్ రద్దు చేయడంతో వారు వెంటనే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మిగతా 14 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ జూలై 28న అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత 29న కాంగ్రెస్-జేడీ(ఎస్) నేతృత్వంలోని ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ఏహెచ్ విశ్వనాథ్, కె. గోపయ్య, నారాయణ గౌడ సంయుక్తంగా స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతాప్ గౌడ పాటిల్, బీసీ పాటిల్, శివరామ హెబ్బార్, ఎస్‌టీ సోమశేకర్, బైరతి బస్వరాజ్, మునిరత్న కూడా కోర్టును ఆశ్రయించారు.