క్రైమ్/లీగల్

పోలీసులకు ‘తల’భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 13: శ్రీనగర్ కాలనీలో వివాహిత హత్య కేసు పోలీసులకు తలభారంగా మారింది. హతురాలు మణిక్రాంతి శిరస్సు కోసం ఏలూరు కాల్వను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందాల గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా ఇంతవరకూ నీటిలో పడేసిన మణిక్రాంతి తల ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిందితుడు ఆమె భర్త ప్రదీప్‌కుమారేనని స్పష్టమైనా పోలీసులు ఇంకా అరెస్టు చూపలేదు. న్యాయపరమైన సాంకేతిక అడ్డంకులు తొలగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెపుతున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న మణిక్రాంతి, ప్రదీప్‌కుమార్ కుటుంబ విభేదాల నేపథ్యంలో ఈ హత్య జరిగింది. భార్య తల నరికి మొండెం నుంచి వేరుచేసిన నిందితుడు తలతో పాటు కత్తిని కూడా ఏలూరు కాల్వలో పారేశాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. హత్యా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినా.. విచారణలో నేరారోపణ చేయాలంటే కష్టపడాల్సిందేనని న్యాయనిపుణులు అంటున్నారు. ఇదే సందేహం హతురాలు మణిక్రాంతి కుటుంబ సభ్యులను కూడా వేధిస్తోంది. దీంతో మొత్తం కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. కేసు దర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీటు దాఖలు చేసిన మీదట నేరాన్ని నిరూపించడంలో హతురాలి ‘తల’ కీలకమవుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇదే అంశాన్ని ఒకరకంగా పోలీసులు కూడా అంగీకరించక తప్పడం లేదు. ఘటనకు సంబంధించి నిందితుడిని దోషిగా కోర్టులో నిర్థారించేందుకు పోలీసుల వద్ద ఉన్న ఆధారం సీసీ కెమెరా పుటేజీతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. అయితే ఎవరు హత్యకు గురయ్యారనేది నిర్థారించేందుకు డిఫెన్స్ కౌన్సిల్‌కు కోర్టులో దీటైన సమాధానం చెప్పాలంటే మొండెం ఒక్కటే సరిపోదని, హతురాలిని గుర్తించేందుకు శిరస్సు తప్పనిసరనే వాదన తెర పైకి వస్తోంది. మరోవైపు నిందితుడు హత్యకు ఉపయోగించిన ఆయుధం కూడా కీలకమే. దీన్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. పోలీసులు చెబుతున్నట్లు తలతో పాటు ఆయుధాన్ని కూడా నిందితుడు కాల్వలో పారేశాడు. ఆయుధం కోసం కూడా అయస్కాంతంతో జల్లెడ పడుతున్నారు. ఈనేపథ్యంలో కేసులో తొలుత నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉండగా, ఇందుకు సంబంధించి లాంఛనాలు పూర్తిచేసే దిశగా పోలీసులు ముందుకెళ్తున్నారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న విచారణాధికారులు క్లిష్టమైన ఈ తరహా కేసులు దేశంలో ఇంతకుముందు ఎక్కడైనా జరిగాయా, జరిగితే ఆయా కేసులకు సంబంధించి న్యాయపరమైన అంశాలు, దర్యాప్తు విధానం, విచారణలో కోర్టులు వెలువరించిన తీర్పు అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఇదిలావుంటే, మణిక్రాంతి హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్‌కుమారేనని నిర్థారణకు వచ్చిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల్లో మరో కోణాన్ని గుర్తించినట్లు సమాచారం. ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వేగంగా వెళ్లడాన్ని దృశాల్లో గుర్తించారు. వీరిలో ఒకరు సోదరుడు, మరొకరు బావ అని గుర్తించిన పోలీసులు వారి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రదీప్‌కుమార్‌తో పాటు ఈ ఘటనలో మరెవ్వరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.