క్రైమ్/లీగల్

బాలికపై లైంగిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: ఇళ్లకు వెళ్లి అరబిక్ నేర్పిస్తానని బాలకపై లైంగిక దాడికి పాల్లడిన సంఘటనలో నిందితుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ రుద్ర భాస్కర్ కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన అబ్దుల్ ఖయ్యూం(23) ఐదేళ్ల నుంచి చాంద్రాయణగుట్ట జీఎం చౌహుని కాలనీలోని నివాసం ఉంటున్నాడు. ఖయ్యూం రెండు సంవత్సరాల నుంచి ఇళ్లకు వెళ్లి అరబిక్ నేర్పిస్తున్నాడు. ఈనెల 19న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాని, బాలిక తల్లి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.