క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 19: రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం చెందిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పరిధిలోని రుస్తపురం గ్రామానికి చెందిన సవిరెడ్డి శివారెడ్డి(60) వ్యవసాయ రైతు. అతడు బోడుప్పల్ ఆకృతి టౌన్‌షిప్‌లో ఉంటున్న కుమారుడి వద్దకు వచ్చాడు. గురువారం సాయంత్రం బైక్‌పై టౌన్‌షిప్ నుంచి బయటకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడని ఎస్‌ఐ రఘరామ్ తెలిపారు.