క్రైమ్/లీగల్

రాములు నాయక్‌కు సుప్రీంలో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు తాత్కాలిక ఊరట లభించింది. గవర్నర్ కోటాలో నియమితులైన తనపై అనర్హత వేటు వేసే అవకాశం లేదంటూ రాములు నాయక్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు ముందు రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా టీఆర్‌ఎస్ అప్పట్లో కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న కె. స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన ఎమ్మెల్సీ నాయక్‌పై అనర్హత వేటు వేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. చైర్మన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని కోర్టు తెలిపింది. దీంతో తాజాగా రాములు నాయక్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్‌ఏ బాబ్డె, జస్టిస్ బీఆర్ గావిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి, శాసనమండలి చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.