క్రైమ్/లీగల్

17 మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 19: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా సిబ్బందిపై పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ క్రమ శిక్షణ చర్యలకు ఉపక్రమించారు. విశాఖ ఏజెన్సీలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న 17 మంది వైద్య సిబ్బందికి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసారు. గిరిజన గ్రామాల్లో మలేరియా నివారణకు చేపడుతున్న పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తుండడంతో వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. షోకాజ్ నోటీసులు జారీ అయిన వారిలో నలుగురు మలేరియా సబ్ యూనిట్ అధికారులతో పాడు మరో 13 మంది వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ సూపర్‌వైజర్లు ఉన్నారు. పాడేరు, పెదబయలు, చింతపల్లి, అనంతగిరి మలేరియా సబ్ యూనిట్ అధికారులు కె.సింహాచలం, కె.సవరప్పడు, ఎస్.చిన్నబ్బాయి, ఎస్.అప్పలనాయుడు, అనంతగిరి ఆరోగ్య కేంద్రంలోని హెల్త్ సూపర్‌వైజర్లు కె.శ్రీనివాసరావు, దాలన్న, లుంగపర్తి, ఎస్.రాజేంద్రపాలెం, హకుంపేట ఆరోగ్య కేంద్రాల హెల్త్ సూపర్‌వైజర్లు కె.మహెష్, ఎం.సంజీవపాత్రుడు, రూడకోటలో జె.వెంకటరావు, ఈదులపాలెంలో ఎం.ప్రభాకరరావు, జి.మాడుగులలో పి.సన్యాసిరావు, గెమ్మెలిలో బి.చిట్టిబాబు, లోతుగెడ్డలో కె.ఎస్.వరప్రసాద్, తాజంగిలో ఎన్.ప్రకాశరావు, కె.డి.పేటలో కె.సింహాచలంలకు ప్రాజెక్టు అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేసారు. షోకాజ్ నోటీసులకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు అధికారి బాలాజీ హెచ్చరించారు.