క్రైమ్/లీగల్

ప్రైవేట్ వోల్వో బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 19: విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వెళుతున్న ప్రైవేట్ వోల్వో బస్సు శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంట ఆర్టీఓ చెక్‌పోస్టు కూడలి వద్ద బోల్తా పడింది. ఈ సంఘటనలో బస్సులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేట్ వోల్వో బస్సు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో రేణిగుంట ఆర్టీఓ చెక్‌పోస్టు మీదుగా వెళుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును వేగంగా నడిపాడని ప్రయాణీకులు తెలిపారు. ఈక్రమంలో డ్రైవర్ బ్రేక్ వేయడం, గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా రోడ్డు తడిచి ఉండటంతో బస్సు అదుపుతప్పి పక్కకు ఒరిగింది. బస్సు పడిన తీరును బట్టి చూస్తే మూడు పల్టీలు కొట్టి పెద్దఎత్తున ప్రాణనష్టం కూడా జరిగే పరిస్థితి. అదృష్టవశాత్తు బస్సు పక్కకు ఒరిగిన ప్రాంతంలో నిలిచివున్న జీపుపై వాలింది. వర్షపు నీటితో నేల తడవడంతో బస్సు రోడ్డుపక్కన ఉన్న జీపుపై ఒరగగానే ఆ బరువుకు జీపు బురదమయమైన నేలలో కూరుకుపోయింది. దీంతో బస్సు పల్టీలు కొట్టకుండా నిలిచిపోయింది. కాగా బస్సు ఒరిగిన జీపులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జీపు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను క్షేమంగా కిందకు దించి వారిని మరో బస్సులో తిరుపతికి పంపించారు. ప్రమాదం జరిగిన తీరుతో ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ ఎవరికీ ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.