క్రైమ్/లీగల్

ఎన్‌ఆర్‌సీ గడువు పొడిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్‌ఆర్‌సీ)లో పలువురి పేర్లు తప్పుగా నమోదు కావడం, మరికొందరి పేర్లు లేకపోవడం వల్ల తుది జాబితా తయారీకి వీలుగా ప్రస్తుతం ఉన్న జూలై 31 గడువును పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరాయి. ఇదే సందర్భంలో ‘్భరత్‌ను ప్రపంచంలోని నిరాశ్రయుల రాజధాని’గా మార్చలేమని కేంద్రం వ్యాఖ్యానించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన డివిజన్ బెంచ్ కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్పించిన సుదీర్ఘ నోట్‌ను పరిశీలించింది. ప్రస్తుత ముసాయిదాలోని నమూనాను పరిశీలించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కాగా, జాతీయ పౌరసత్వ జాబితా తయారీ ఈ ఏడాది జూలై 31లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు, అస్సాం ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే, ఈ జాబితాలో చాలా తప్పులు దొర్లడం, ఎన్నో పేర్లను తొలగించిన నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముసాయిదా తుది జాబితా ఖరారు చేయడం కోసం గడువును పొడిగించాలని కేంద్రం, అస్సాం ప్రభుత్వాలు సుప్రీంకోర్టును కోరినట్టు ఈ అంశంపై వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ‘్భరత్‌ను ప్రపంచంలోని శరణార్థులకు రాజధానిగా మార్చలేం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమర్పించిన ముసాయిదాను పునఃపరిశీలించాలని ఆయన కోర్టులో తన వాదనలు వినిపించారు. ఎంతోకాలం నుంచి స్థానికంగా నివాసం ఉంటున్న భారత పౌరుల పేర్లను తప్పించి బంగ్లాదేశ్ సరిహద్దులోని జిల్లాలకు చెందిన లక్షలాది పౌరుల పేర్లను కొందరు స్థానిక అధికారుల ప్రమేయంతో ముసాయిదాలో తప్పుడుగా నమోదు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోర్టుకు సమర్పించిన ముసాయిదా జాబితాను పునఃపరిశీలించి అవసరమైన పేర్లు చేర్చడం, అనవసరం కాని పేర్లను తొలగించి పకడ్బందీగా రూపొందించేందుకు వీలుగా గడువు పొడిగించాలని సొలిసిటర్ జనరల్ ఇటు కేంద్రం, అటు అస్సాం ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టును కోరారు. ఎన్‌ఆర్‌సీ ముసాయిను డిసెంబర్ 31, 2017, జనవరి 1, 2018న ప్రచురించారు. ఈ జాబితాలో తమ పేర్లు చేర్చాలని మొత్తం 3.29 కోట్ల దరఖాస్తులు రాగా కేవలం 1.9 కోట్ల మంది పౌరుల పేర్లను మాత్రమే అందులో చేర్చడంతో అప్పట్లో చర్చనీయాంశమైంది.