క్రైమ్/లీగల్

బార్‌లో ఘర్షణ.. హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 25: తాగిన మైకంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ.. ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ తుకారంగేట్‌లో నివసిస్తున్న మెరుగు లక్ష్మణ్ కుమారుడు సాయి ప్రసాద్ (31) ఆటో డ్రైవర్. అతడు చిల్కానగర్‌లో బంధువుల ఇంట్లో ఆదివారం జరిగిన ఫంక్షన్‌కు వచ్చిన తండ్రి లక్ష్మణ్‌ను తీసుకెళ్లడానికి సోమవారం వచ్చాడు. ఇంటికి వచ్చిన సాయికి మర్యాద చేయడానికి బంధువులైన శ్రీకాంత్, ఉదయ్ కుమార్ కలిసి ఇదే ప్రాంతంలో ఉన్న బార్‌కు వెళ్లారు. పీకల దాకా తాగిన మైకంలో బిల్లు చెల్లించే విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. సాయి తిట్టడంతో ఆగ్రహంతో శ్రీకాంత్ పట్టుకోగా ఉదయ్ చేతిలో ఉన్న బీర్‌సీసాతో సాయిప్రసాద్ తలపై కొట్టారు. కింద పడి అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతన్ని ఇద్దరు కలిసి స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసికెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి 10 గంటలకు సాయి మరణించాడు. క్షణికావేశం నిండు ప్రాణం తీయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రవిబాబు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.