క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ప్రక్రియను ఐదు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే శ్రీనివాసగౌడ్ పురపాలక సంఘాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై జస్టిస్ పి నవీన్‌రావు విచారణ చేపట్టారు. శ్రీనివాస్ గౌడ్ తరఫున కేజీ కృష్ణమూర్తి, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున విద్యాసాగర్‌లు తమ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు వాదనలు వినిపించారు. హైకోర్టులో ఇదే అంశంపై దాఖలైన మూడు పిటీషన్లను కలిపి విచారించిన జస్టిస్ నవీన్‌రావు తక్షణమే ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించారి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియను చేపట్టడం లేదంటూ స్వయంగా ఎన్నికల సంఘం సైతం హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై మరో రెండు పిటీషన్లు దాకలయ్యాయి. వీటన్నింటిపైనా గత నెల 31 నుండి విచారణ జరుగుతోంది. తమకు ఐదు నెలల గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు మరోమారు విచారణ చేపట్టిన హైకోర్టు 119 రోజుల్లో వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ, రిజర్వేషన్ల ఖరారు చేయాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత నెల రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మరో మారు వారాల పాటు వాయిదా వేసింది.