క్రైమ్/లీగల్

‘ఆప్’ ఎమ్మెల్యేకు మూడు నెలల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే మనోజ్ కుమార్‌కు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2013 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో తూర్పు ఢిల్లీలోని ఒక పోలింగ్ బూత్‌లో అడ్డంకులు సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆప్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్‌కు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించగా, అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ ఆయనకు 10 వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. అయితే, కోర్టు తీర్పుపై ఎమ్మెల్యే పై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. తూర్పు ఢిల్లీలోని కొండ్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ తనపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనను ఇందులో ఇరికించారని ఆయన వ్యాఖ్యానించారు. ‘నిందితుడు మనోజ్ కుమార్ ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 131 కింద క్రమరాహిత్యానికి పాల్పడినందుకు, పోలింగ్ స్టేషన్లలో అడ్డంకులు సృష్టించినందుకు దోషిగా తేలింది. ఇందుకుగాను అతనికి మూడు నెలల జైలు శిక్షతోపాటు 10 వేల రూపాయల అపరాధ రుసుం విధిస్తున్నాం’ అని కోర్టు పేర్కొంది. ఎమ్మెల్యే మనోజ్ కుమార్ అభ్యర్థన మేరకు తనపై విధించిన శిక్షపై అప్పీలు లేదా రివిజన్ పిటిషన్‌కు అవకాశం ఉంది. జూలై 25 వరకు బెయిల్‌పై ఉండేందుకు 10 వేల రూపాయల పూచీకత్తును అంగీకరిస్తున్నాం’ అని కోర్టు తెలిపింది. ఇదిలావుండగా, ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..ఆప్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ నేతృత్వంలో దాదాపు 50 మంది కార్యకర్తలు 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎంసీడీ స్కూల్‌లో అవరోధాలు సృష్టించారు.