క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మే 25: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొన్న ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్ పట్టణానికి చెందిన ధాత్రిక అక్షయ్‌కుమార్(19) బీఎస్సీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కండ్లకోయ సీఎంఆర్ కళాశాల హాస్టల్‌లో ఉండే తన మిత్రులు వంశీ, షఫీలతో కలిసి కంబైన్ స్టడీస్ చేసేందుకు శుక్రవారం రాత్రి కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల హాస్టల్‌కు హోండా అక్టియా వాహనంపై వెళ్లాడు. శనివారం తెల్లవారుఝామున ముగ్గురు స్నేహితులు అక్టివాపై త్రిబుల్ రైడింగ్ చేస్తూ 44వ జాతీయ రహదారిపై కండ్లకోయ నుంచి మేడ్చల్‌కు వస్తుండగా కండ్లకోయ రింగ్‌రోడ్డు జంక్షన్ సమీపంలో ఆక్సిజన్ పార్కు సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. వాహనం నడిపిస్తున్న అక్షయ్‌కుమార్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వంశీ, షఫీని 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మక్కా యాత్రకు వెళ్లి..
ఆకస్మిక మృతి
షాద్‌నగర్ రూరల్, మే 25: రంజాన్ మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర మక్కా సందర్శన యాత్రకు వెళ్లిన బురాన్ ఆకస్మికంగా మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన బురాన్ (40) అనే వ్యక్తి రంజాన్‌మాసం ప్రారంభ సమయంలో పవిత్ర మక్కా సందర్శన యాత్రకు బయల్ధేరి వెళ్లారు. శనివారం ఉదయం మక్కాలోనే బురాన్ ఆకస్మాత్తుగా మరణించినట్లు తెలిపారు. బురాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. మృతదేహం గ్రామానికి రావడాని కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
అక్రమ ఇసుక ట్రాక్టర్ స్వాధీనం
కులకచర్ల, మే 25; అక్రమంగా ఇసుక రవాణా కులకచర్ల మండలంలో యధేచ్చగా కొనసాగుతోంది. అప్పుడప్పుడు పోలీసులు వివిధ రకాల వాహనాలను పట్టుకున్నప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా శనివారం ట్రాక్టర్‌లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా కులకచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో రాత్రి వేళల్లో వివిధ రకాల వాహనాలతో ఇసుకను తరలిస్తున్నారు. దళారులు జోక్యం చేసుకుని ప్రతినెల కొంతమొత్తంలో వసూల్లు చేస్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇసుక వ్యాపారం చేసే వారు కూడా పలువురిని మచ్చిక చేసుకుని కొనసాగిస్తున్నారు. వీరిలో కొంతమంది పలువురి పరిచయాలను ఎరగా చూయిస్తూ రోజు ఒకటి రెండు ట్రాక్టర్ల చొప్పున ఇసుక రవాణా చేస్తున్నారు. మరికొంతమంది ఇసుకను ఒక దగ్గర జమ చేసి రోజుకింత చొప్పున రవాణా చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు
పూలేను స్ఫూర్తిగా తీసుకోవాలి
కాచిగూడ, మే 25: మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పూలే ఫౌండేషన్, లక్ష్య సాధన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశేష సేవలందించిన వారికి పూలే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈటెల రాజేందర్ పాల్గొని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులు నటుడు ఆర్.నారాయణ మూర్తి, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, మల్లేశం, కృష్ణమూర్తి, విజయభాస్కర్, ప్రకాశం గౌడ్‌కు అవార్డులను ప్రదానం చేశారు. సామాజిక శాస్తవ్రేత్తలుగా ఎదిగినప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 250 గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి విద్యార్థులకు ప్రవేటుకు దీటుగా నాణ్యమైన విద్యనందిస్తుందని వివరించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు విక్రమ్ గౌడ్, లింగయ్య, కన్వీనర్ బడేసాబ్ పాల్గొన్నారు.