క్రైమ్/లీగల్

పక్కా గృహాల నిర్మాణం పేరుతో ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, మే 25: పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని నామమాత్రంగా 30వేలు చెల్లించి ఇంటిని సొంతం చేసుకోవచ్చని నమ్మించి 8కోట్ల రూపాయలు వసూలుచేసిన మాల్యావికరుణ సొసైటీ సభ్యులను అరెస్టుచేసినట్లుగా భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పక్కా గృహాలు 30వేలకే నిర్మించి ఇస్తామని మోసంచేసి 8కోట్ల రూపాయలు 2,700మంది బాదితులనుండి వసూలుచేసిన మాల్యావి కరుణ సొసైటీ సభ్యులు నలుగురిని అరెస్టుచేసి వారినుండి 12లక్షల 22వేల రూపాయల నగదు, ల్యాప్‌టాప్‌ను స్వాదీనం చేసుకుని నిందితులను కోర్టుకు రిమాండ్‌చేసినట్లుగా తెలిపారు. ఇండ్లులేని నిరుపేదల అవసరాన్ని గుర్తించిన సోసైటీసభ్యులు ఆరుగురు ఇండ్లులేని పేదలవద్దనుండి 30వేల రూపాయలు ముందస్తుగా చెల్లిస్తేచాలని తామే 7లక్షల 50వేల రూపాయల విలువచేసె పక్కాగృహాలను కట్టించి ఇస్తామని 2700మందిని మోసంచేసినట్లుగా తెలియజేసారు. డబ్బుకటించుకున్నాక ఆరునెలలు గడిచినా ఇండ్ల నిర్మాణ చేపట్టకపోవడంతో ఆలేరు మండల కేంద్రంలో రమాదేవి అనె మహిళ ఇచ్చిన పిర్యాదుమెరకుర రంగంలోకి దిగిన ఎస్ ఓటీ పోలీసులు ఇండ్లనిర్మాణ రాకెట్‌ను గుట్టురట్టు చేయడంతోపాటుగా కర్మాన్‌ఘాట్‌లోని వారి కార్యాలయంలో రికార్డులతోపాటుగా నిందితులు కొండ కృష్ణమ్మ, కొండ రమేష్, కొండ వెంకటనారాయణ, కట్ట మహేంద్రనాధ్, కొత్త రాజిరెడ్డి, జజర్లసాయి చరణ్‌లను అరెస్టుచేసి కోర్టుకు రిమాండ్‌చేసినట్లుగా తెలియజేసారు. బాదితులు ఎవరైనా రశీదును సమర్పించి కోర్టుద్వారా తమ సొమ్మును తిరిగి పొందవచ్చన్నారు. ఈవిలేఖరుల సమావేశంలో ఏసీపీ భుజంగరావు, పోలీసు ఇన్స్‌పెక్టర్లు, ఎస్సైలు ఉన్నారు.