క్రైమ్/లీగల్

నీటి కుంటలో పడి రెండేళ్ల బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, ఏప్రిల్ 23: అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడు నీటి కుంటలో పడి దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని తాడివెన్ను గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఈదా ఆకాష్ (02) అనే బాలుడు అంగన్‌వాడీ కేంద్రంలో మూడు వరలు తీసిన నీటి కుంటలో మునిగి మృతి చెందాడు. అంగన్‌వాడీ కేంద్రంలో గుంటను తవ్వటంతో పాటు మూత కూడా వేయకపోవటంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కేవలం అంగన్‌వాడీ టీచర్ నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆడుకోవడానికి వెళ్లిన ఆకాష్ రాత్రి పొద్దుపోయే వరకు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అంగన్‌వాడీ కేంద్రం వద్ద తవ్విన నీటి కుంటలో ఆకాష్ మృతదేహాన్ని గుర్తించి ఒక్కసారిగా గొల్లుమన్నారు. సాయంత్రమే ఆకాష్ ఆ నీటి కుంటలో పడిపోగా దీన్ని ఎవ్వరూ గమనించకపోవడం విశేషం.