క్రైమ్/లీగల్

ఆ పేపర్లు మళ్లీ దిద్దొచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వివాదంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫెయిలైన విద్యార్థుల పేపర్లు మళ్లీ మూల్యాంకన చేయవచ్చా?అని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన లంచ్ మోషన్ ప్రజావాజ్యం హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. తొలుత పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం 2.15కి విచారిస్తామని స్పష్టం చేసింది. బాధ్యులపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఆత్మహత్యలకు పాల్పడిన 16 మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్ కోరారు. ఎలాంటి ఫీజు లేకుండా పేపర్ల రీ- వాల్యూయేషన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సాఫ్ట్‌వేర్ అందజేస్తున్న ‘గ్లోబరీనా’ సంస్థను బ్లాక్‌లో పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఇంటర్ బోర్డు కార్యదర్ళి, ఇంటర్ విద్య కమిషనర్, విద్యాశాఖ కార్యదర్శి , డీజీపీ, నగర కమిషనర్‌ను ప్రతివాదులుగా పిటిషన్‌లో చేర్చారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ సైతం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్ , జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డిలతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. దీనికి ఎంత సమయం పడుతుందని అదనపుఅడ్వొకేట్ జనరల్ జే రామచందర్‌రావును ప్రశ్నించింది. సుమారు రెండు నెలల సమయం పడుతుందన్న ఆయన వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిలైన మూడు లక్షల మంది విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనానికి అంత సమయం ఎందుకు? అని బెంచ్ ప్రశ్నించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్ రావు ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ జీవోనూ ఆయన సమర్పించారు. ఏజన్సీ పనితీరుపై మాత్రమే విచారణకు ఆదేశించిందని అభిప్రాయపడిన హైకోర్టు మొత్తం వ్యవహారంపై పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు దీనిపై జుడీషియల్ విచారణకు ఆదేశించాలంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది దామోదర్‌రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరగా, జుడీషియల్ విచారణతో విద్యార్థులకు ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. సోమవారం లోపు అభిప్రాయాన్ని చెప్పాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.