క్రైమ్/లీగల్

నీరవ్ మోదీపై అరెస్టు వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర ముంచేసి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై లండన్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయనను త్వరలోనే అదుపులోకి తీసుకుని భారత్‌కు అప్పగించే ప్రక్రియను చేపడతామని అధికారవర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన నీరవ్ మోదీని అప్పగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థనను పురస్కరించుకుని ఓ లండన్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసిందని వెల్లడించాయి. వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఈ అరెస్టు వారెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఇటీవలే వివరించారని, త్వరలోనే లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు నీరవ్ మోదీని అదుపులోకి తీసుకుని బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారని, అనంతరం ఆయనను భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలవుతుందని అధికారులు తెలిపారు. కాగా, 9వేల కోట్ల రూపాయల మేర మనీ లాండరింగ్‌కు పాల్పడి భారత్ నుంచి పారిపోయిన విజయ్ మాల్యాను రప్పించే విషయంలోనూ ఇదే ప్రక్రియను అనుసరిస్తున్నామని, ప్రస్తుతం ఆ కేసు చివరిదశలో ఉందని అధికారులు తెలిపారు.