క్రైమ్/లీగల్

శేషాద్రినగర్ గెస్ట్‌హౌస్‌లో దొంగల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 15: టీటీడీ విజిలెన్స్, పోలీస్ అధికారులకు దొంగలు సవాల్ విసిరారు. తాళాలు వేసి వున్న గదులను ఎంపిక చేసుకుని, అందులోని భక్తులు ఎక్కువ సమయం తిరిగి ఆ గదుల వద్దకు రారన్న విషయం తెలుసుకుని తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలలో జరుగుతున్న పెళ్లికి వచ్చినవారు బస చేసిన ఐదు గదుల్లో చొరబడ్డ దొంగలు చేతివాటం ప్రదర్శించి 4 సెల్‌ఫోన్లు, రూ.20వేలు నగదు ఎత్తుకెళ్లిపోయారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల సమాచారం మేరకు కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన వివాహ బృందం గురువారం ఉదయం శేషాద్రినగర్ గెస్ట్‌హౌస్‌లోని 39,40, 41,42, 44, 52 గదులను తీసుకున్నారు. వీరంతా శుక్రవారం ఉదయం తిరుమలలో జరుగుతున్న పెళ్లికి వెళ్లారు. తిరిగి సాయంత్రం తమ గదుల వద్దకు వచ్చినవారు గది తాళాలు తీసి ఉండటం, తమ లగేజీలోని వస్తువులన్ని చిందరవందరగా పడి ఉండటం గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని వారు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన అన్ని గదులను పరిశీలించారు. ఈ విషయాన్ని తిరుమల పోలీసులకు తెలియజేశారు.