క్రైమ్/లీగల్

జయరాం హత్యకేసులో మరో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో మరో ముగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖాచౌదరి పాత్ర ఉన్నట్టు కథనాలు వెలువడ్డా విచారణ తరువాత ఆమె ప్రమేయం లేనట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా అరెస్టయిన వారిలో సినీ నటుడు సూర్యప్రసాద్, సూర్య అసిస్టెంట్ కిశోర్‌తోపాటు సిరిసిల్ల రియల్టర్ అంజిరెడ్డి ఉన్నారు. జయరాం హత్యకేసు విచారణ దాదాపు పూర్తికావచ్చిందని దర్యాప్తు అధికారి ఏఆర్ శ్రీనివాస్ గురువారం మీడియాకు వివరించారు. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న కోణంలో విచారణ చేస్తున్నామని, అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఏపీ మంత్రులకు సైతం రాకేష్‌డ్డి ఫోన్లు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వారి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నామని వెల్లడించారు. 20 రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ దాఖలు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. ఎక్స్‌ప్రెస్ చానల్ అధినేత, పారిశ్రామికవేత్త హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. జయరాంను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే రాకేష్‌రెడ్డి కుట్ర చేశాడన్నారు. జయరాం హత్యకు ముందు సూర్యప్రసాద్, కిశోర్, అంజిరెడ్డిని రాకేష్‌రెడ్డి ఇంటికి పిలిచాడని ఆయన అన్నారు. జయరాంను హత్య చేసిన విషయం తెలిసినా అంజిరెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపారు. కాగా జయరాంను బెదిరించి రాయించుకున్న దస్తావేజీలు అంజిరెడ్డి దాచాడన్నారు. మరోపక్క హత్యానంతరం పోలీసు అధికారులతో రాకేష్‌రెడ్డి మాట్లాడిన అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రగతి రిసార్ట్స్ యజమానులను సైతం రాకేష్‌రెడ్డి బెదిరించినట్టు ఆయన వెల్లడించారు. జయరాం హత్యలో సూర్య, కిశోర్, అంజిరెడ్డి కీలక పాత్ర పోషించాన్నారు. కిశోర్ అనే వ్యక్తి హానీట్రాప్ చేసి ఎన్నారైను రాకేష్‌రెడ్డి ఇంటికి రప్పించాడన్నారు. వీణ అనే అమ్మాయి పేరు చెప్పి జయరాంను తీసుకురావాలని సూర్య, కిశోర్‌కి రాకేష్‌రెడ్డి ఆదేశించాడని డీసీపీ పేర్కొన్నారు. అమ్మాయిని ఎర వేసే జయరాంను రప్పించారని ఆయన చెప్పారు. ఏపీ టీడీపీ నేతలతో హంతకుడు రాకేష్‌రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని దర్యాప్తు అధికారి తెలిపారు.
చిత్రాలు.. మీడియాతో మాట్లాడుతున్న డీసీపీ శ్రీనివాస్
*సినీ నటుడు సూర్య