క్రైమ్/లీగల్

ప్రియురాలిపై కత్తితో దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఫిబ్రవరి 21: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్‌టిపిసిలో ప్రియురాలిపై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ప్రియుడు తన ప్రియురాలిని రెస్టారెంట్‌కని పిలిచి కత్తితో దాడి చేసిన ఘటన రామగుండంలో సంచలనమైంది. ఎన్‌టీపీసీ ఆటోనగర్‌లో నివసించే స్రవంతి అనే యువతి శ్రీనివాస్ అనే యువకునితో కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో యువతి స్రవంతిపైన అనుమానంతో శ్రీనివాస్ ఈ దాడికి పూనుకున్నట్లు తెలుస్తోంది. యువతి నడుము భాగంలో, ఇతర శరీర భాగాలపై కత్తితో దాడి చేసి గాయపర్చగా యువతిని వైద్యం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం యువతి చికిత్స పొందుతుండగా ఎలాంటి ప్రాణాపాయం మాత్రం లేదని చెబుతున్నారు. పోలీసులు బాధితురాలి నుంచి వివరాలను సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు.

చిత్రం.. బాధితురాలు స్రవంతి