క్రైమ్/లీగల్

జాతి వ్యతిరేక నినాదాలు నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, ఫిబ్రవరి 21: జమ్ములో కాశ్మీరీ ముస్లిం ప్రయాణికుల్లోని కొంతమంది జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చిన ఘటనపై జమ్మూకాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చినట్టు దగ్గరలోని షాపుల్లో గల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ ముగ్గురి చిత్రాలను విడుదల చేశారు. వారికి సంబంధించిన సమాచారం, వారు ఎక్కుడున్నది మొదలయిన వివరాలు తెలిస్తే తమకు తెలియచేయాలని పోలీసులు ప్రజలను కోరినట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారీ హిమపాతం, వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. దీంతో విద్యార్థులు సహా వేలాది మంది కాశ్మీరీ ముస్లిం ప్రయాణికులు జమ్ములో చిక్కుబడిపోయారు. ఇలా చిక్కుకుపోయిన ప్రయాణికులు జమ్ములోని నోవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జీజీఎం సైన్స్ కళాశాల సమీపంలో ఈ నెల 11న నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వారిలో కొంతమంది జాతి వ్యతిరేక నినాదాలు చేశారని అధికారులు తెలిపారు. సంఘటన స్థలానికి సమీపంలోని షాపుల్లో గల సీసీటీవీ కెమెరాల ఫుటేజీల ద్వారా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారిపై దేశద్రోహం సహా వివిధ అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు నిందితుల ఆచూకి కోసం జమ్ము సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పీ) తాజీందర్ సింగ్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, జమ్ములో చిక్కుకు పోయిన కొంతమంది కాశ్మీరీ ముస్లిం ప్రయాణికులు జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చినప్పటి నుంచి జమ్ములో వందలాది మంది కళాశాల విద్యార్థులు మూడు రోజుల పాటు తరగతులు బహిష్కరించి, నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొంతమంది ప్రయాణికులు పాకిస్తాన్‌కు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారని, వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.