క్రైమ్/లీగల్

ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఫిబ్రవరి 21:నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థి నూజివీడు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా దుర్గి మండలం తేరాల గ్రామానికి చెందిన తుపాకుల యువరాజ్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి చినరంగస్వామి ఇటీవలి కాలంలో మృతి చెందాడు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతూ విజయవాడలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఆరోగ్యం సరిగా లేదంటూ నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్‌కి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం భోజనం అనంతరం విద్యార్థి ఎలుకలు నివారించేందుకు ఉపయోగించే మందు సేవించి అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్ధులు ట్రిపుల్ ఐటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే విద్యార్ధి యువరాజును ఏరియా వైద్యశాలలో చేర్చారు. నూజివీడు సీఐ గీతారామకృష్ణ విద్యార్థి నుండి వివరాలు సేకరించారు. కుటుంబ గొడవలతో తీవ్రంగా మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యువరాజు ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు తెలిపారు.