క్రైమ్/లీగల్

బ్యాగ్ కాజేసిన ఆటోడ్రైవర్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మార్చి 5: ఆటోలో మరచిపోయిన బ్యాగ్‌ను దొంగిలించిన ఆటోడ్రైవర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి రూ. మూడున్నర లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఏడీసీపీ షరీన్ బేగం మాట్లాడుతూ నగరంలోని పటమటలంకకు చెందిన ఇంకొల్లు అంకమరావు (35) అగ్రిగోల్డ్‌లో పనిచేస్తూ మానేసి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. గత నెల 22న గవర్నరుపేట రాజగోపాలచారి వీధిలోని అప్సర థియేటర్ వద్ద ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆటో ఎక్కి అయ్యప్పనగర్ వెళ్లారు. వారు ఆటో దిగుతూ తమ బ్యాగ్‌ను మరిచిపోయారు. ఆటోడ్రైవర్ అంకమరావు ఆ కవర్‌ను చూసి కాజేసి మరుసటి రోజు గుంటూరు వెళ్లి తన మిత్రులను కలిశాడు. మిత్రుడు పద్మాకర్ సాయంతో అక్కడ మణప్పురం ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టాడు. ఈ క్రమంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆటో గురించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను గుర్తించి విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో అంకమరావును గుర్తించారు. పటమట ఈ-సేవ సెంటర్ వద్ద అంకమరావు అనునామాస్పదంగా సంచరిస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. మూడున్నర లక్షల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ సమావేశంలో ఏసీపీ వర్మ, సుందరరాజు, సీఐలు హుస్సేన్, బాలమురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.