క్రైమ్/లీగల్

త్వరలో వీధి వ్యాపార జోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వీధి వ్యాపారుల కోసం వీధి వ్యాపార జోన్లను ఏర్పాటు చేస్తామని, ఈ విషయమై నోటిఫికేషన్ జారీ చేస్తామని, ప్రస్తుతం వీధి వ్యాపారులపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 67,313 మంది వీధి వ్యాపారులు ఉన్నారని, ఇంకా సర్వే కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. మూడు కేటగిరీలుగా జోన్లను ఏర్పాటు చేస్తామని, ఇందులో ఫ్రీ వెండింగ్ జోన్ (వీధి వ్యాపారులు) ఉంటుందన్నారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వీధి వ్యాపారాలను ఎంపిక చేసిన చోట్ల నిషేధిస్తామని కూడా కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌లో నిమ్స్ వద్ద వీధి వ్యాపారి జి గణేష్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రప్రభుత్వం వీధి వ్యాపారుల పరిరక్షణ, నియంత్రణ చట్టం 2014ను అమలు చేయడం లేదని, పిటిషనర్ కోర్టుకు తెలిపారు. వీధి వ్యాపారుల విషయంలో అధికారుల జోక్యం పెరుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది ఏ సంజీవ్ కుమార్ వాదనలను హైకోర్టు ధర్మాసనం వద్ద వినిపించారు. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయ లక్ష్మి విచారించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ వీధి వ్యాపారుల సంక్షేమం కోసం ప్రభుత్వం 2014 చట్టానికి లోబడి కొత్త స్కీంను 2016లో తెచ్చిందన్నారు. సర్వే తర్వాత హైదరాబాద్ మినహాయించి రాష్ట్రంలో అన్ని చోట్ల వీధి వ్యాపారుల కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 66 స్థానిక సంస్థల్లో సర్వే పూర్తయిందన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం ఉద్దేశించిన ప్రణాళికను మారుస్తామన్నారు. అనంతరం ఈకేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.