క్రైమ్/లీగల్

రాళ్ల దాడి కేసునుంచి 9,730 మందికి విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, ఫిబ్రవరి 3: జమ్మూకాశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ జవాన్లపై రాళ్ల దాడులకు పాల్పడిన 9,730 మందిపై కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. 2008 నుంచి 2017 మధ్యకాలంలో నమోదైన మొత్తం కేసుల్లో 1,745 మాత్రం కొన్ని నిబంధనల మేరకు కేసులు ఎత్తివేస్తామని వెల్లడించారు. గత రెండేళ్లలో చిన్న చిన్న సంఘటనల్లో పాల్గొన్న 4వేల మందిపై కేసులను బేషరతుగా ఎత్తివేస్తున్నామని శాసనసభలో జరిగిన చర్చలో ఓ లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. 2016, 2017 సంవత్సరాల్లో 3,773 కేసులు నమోదు కాగా, 11,290 మంది అరెస్టయ్యారని, 233 మంది ఆచూకీ తెలియలేదని అన్నారు. 1,692 కేసుల్లో చార్జిషీట్లు ఫైల్‌కాగాని, 1,841 కేసులపై దర్యాప్తు జరుగుతోందని హోంమంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న మెహబూబా తెలిపారు. 2016 జూలైలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ముర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం జరిగిన అల్లర్లలో 85 మంది మరణించారని అన్నారు. ఈ సందర్భంగా 2,904 కేసులు నమోదు కాగా, 8,570 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 2017లో ఈ రకంగా రాళ్లదాడుల్లో అరెస్టయిన 2,720 మందిలో 869 మందిని ఇప్పటికే విడుదల చేశామన్నారు. ఇలావుండగా 2016-17 మధ్యకాలంలో శ్రీనగర్‌లో అత్యధికంగా 2,330 మంది అరెస్టు కాగా బాలాముల్లాలో 2,046, పుల్వామాలో 1,385, కుప్వారాలో 1,123, అనంతనాగ్‌లో 1,118, బుద్గామ్‌లో 783, గందర్‌బాల్‌లో 714, షోఫియాన్‌లో 694, బండిపోరాలో 548, కుల్గామ్‌లో 547, డోడా జిల్లాలో ఇద్దరు అరెస్టయ్యారు. రాళ్లదాడులకు పాల్పడిన 4,949 మందిలో 56 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 16 మంది హురియత్ కాన్ఫరెన్స్ కార్యకర్తలున్నట్లు గుర్తించామని మిగిలినవారికి ఏ ఉగ్రవాద సంస్థతోనూ సంబంధాలు లేవని తెలిపారు.

చిత్రం..శనివారం జమ్మూలోని బారి బ్రాహ్మణ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ను సందర్శించిన జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ