క్రైమ్/లీగల్

స్కూల్ డ్రెస్‌ల పేరిట దగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, మార్చి 19: ప్రముఖ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన డ్రెస్‌లను సప్లై చేస్తామని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై సంజీవరెడ్డినగర్ (ఎస్సార్‌నగర్) పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విద్యా సంస్థ తమ పాఠశాలల చదువుకునే విద్యార్థులకు డ్రెస్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం పలువురు యాజమాన్యాన్ని సంప్రదించారు. బంజారాహిల్స్‌కు చెందిన స్టైల్స్ టైలర్ సభ్యులు రామారావు, అంగరాలు తాము చేస్తామని నమ్మబలికారు. ఇది నిజమని నమ్మిన యాజమాన్యం సుమారు రూ.31 లక్ష అడ్వాన్స్‌గా చెల్లించింది. రోజులు గడుస్తున్న వారు డ్రెస్‌లను సప్లై చేయక పోవడంతో వారిని సంప్రదించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో సదరు విద్యా సంస్థలకు చెందిన అధికారిణి ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.